ఏపీ పీజీఈ సెట్ సీట్ల కేటాయింపు శుక్రవారం ముగి సింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,881మంది ప్రవేశ పరీక్షలో అర్హత సాధించగా వీరిలో 11,332మంది మాత్రమే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కన్వీనర్ కోటాలో మొత్తం 16,564 సీట్లు అందుబాటులో ఉండగా 9,461 భర్తీ అయ్యాయి. 1,103 సీట్లు మిగిలాయి.
సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ ను ఈనెల 14 నుంచి 16వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రత్యేక ఆధికారి రఘునాథ్ తెలిపారు. లా సెట్ కౌన్సెలింగ్ ను 23నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
MORE IN THIS SECTION